మేడ్చల్: డిప్యూటీ కమిషనర్ ని కలిసి లిఖితపూర్వక ఫిర్యాదును అందజేసిన మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్
శుక్రవారం మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్, డిప్యూటీ కమిషనర్ సుల్తానాని కలిసి శానిటేషన్ పై దృష్టి పెట్టాలని, కొందరు ఎస్ఎఫ్ ఏ లను మార్చాలని లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశారు. ముఖ్యంగా ఓల్డ్ నేరేడ్మెట్, చాణక్యపురి, ఆర్కే నగర్లలో ఆశించిన మేరకు పని జరగట్లేదని అన్నారు. అదేవిధంగా టాక్స్ రెవెన్యూ సెక్షన్ వారు ఇష్టానుసారంగా మధ్య తరగతి వారికి ఆస్తి పన్ను పెంచుతున్నారని దానిని సవరించాలని అన్నారు. కొన్ని సంస్థలు అడ్వర్టైజ్మెంట్స్ బోర్డులు ఇస్తానుసారంగా పెడుతున్నారని, వారు నుంచి జిహెచ్ఎంసికి రావలసిన డబ్బు కాబట్టి అభివృద్ధి పనులకు కేటాయించాలని అన్నారు.