ముఖ్యమంత్రి సహాయ నిధి పేదవారికి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది : కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్
అన్నమయ్య జిల్లా కోడూరు మండలం, నారాయణరాజుపాడు గ్రామానికి చెందిన నారికే చిలకమ్మ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.25,541/- చెక్కును వారి నివాసం వద్ద *ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్* అందజేశారు. *అరవ శ్రీధర్ మాట్లాడుతూ* – “ప్రజల కష్టసుఖాల్లో పక్కనే నిలబడటం మా కూటమి ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎన్నో కుటుంబాలు ఉపశమనం పొందుతున్నాయి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సతీమణి ముక్క వరలక్ష్మి పాల్గొన్నారు.