ఏటూరునాగారంలోని చిన్నబోయినపల్లి గ్రామ సమీపంలోని పోడు భూముల్లో పండ్ల మొక్కలను నాటి పోడు రైతులకు ఉపాధి కల్పించనున్నట్లు అటవీశాఖ రేంజర్ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. శనివారం సాయంత్రం పోడు భూముల్లో వివిధ రకాల పండ్ల మొక్కలను నాటడం జరిగిందన్నారు. పండ్ల మొక్కల ద్వారా రైతులకు ప్రత్యేకమైన స్టాళ్లను ఏర్పాటు చేసి ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.