కూటమి ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు బుధవారం గుడిపాల మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీఎంఏజేవై ద్వారా గ్రామ పంచాయతీల్లో చర్చ సేకరణ కోసం మంజూరైన ఐదు ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే స్వయంగా ఆటో నడిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి పారిశుద్ధ్య నిర్వహణపై కూటమి ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది అన్నారు ఈ ఆటోలను సద్వినియోగం చేసుకొని గ్రామాలను శ్రద్ధగా ఉంచడంతోపాటు వ్యర్థాలను సరైన రీతులో ప్రాసెసింగ్ చేయాలని అన్నారు