ఆందోల్: జోగిపేటలో శ్రీ కేతకి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి జిల్లా ఆందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించారు. పర్యటనలో భాగంగా జోగిపేటలో శ్రీ కేతకి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి దామోదర పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.