మానవత్వం చాటుకున్న డోన్ జనసేన నాయకుడు మైఖేల్
Dhone, Nandyal | Oct 22, 2025 డోన్ రూరర్ పోలీస్ స్టేషన్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రుల పట్ల జననేన నాయకుడు మైఖేల్ సేవా మనసుతో స్పందించారు. అటుగా వెళ్తున్న మైఖేల్ ప్రమాదాన్ని గమనించి గాయపడిన వారిని తన కారులో ఎక్కించుకొని, ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం గాయపడిన వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలుపగా అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.