ప్రొద్దుటూరు: సామాజిక న్యాయం ఆత్మగౌరవంకై సిపిఐ నిరసన
Proddatur, YSR | Nov 18, 2025 భారత కమ్యూనిస్టు పార్టీ CPI జాతీయ సమితి పిలుపులో భాగంగా మంగళవారం సాయంత్రం కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వొద్ద గల జ్యోతిరావు ఫూలే విగ్రహం ఎదుట దేశంలో దళిత గిరిజన,బడుగు బలహీన వర్గాల వారికి సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కాపాడాలని డిమాండ్ చేస్తూ సీపీఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి రామయ్య మాట్లాడుతూ, విభిన్న మతాలు, విభిన్న కులాలు, సంస్కృతులు, ఆచార వ్యవహారాలు ఉన్నటువంటి దేశం మనదన్నారు. దేశంలో బిజెపి అధికారం చేపట్టినప్పటి నుంచి బీసీలపై, దళిత, గిరిజన, మైనార్టీలపై దాడులు పెరిగిపోతున్నాయన్నా