సంక్షేమ శాఖలు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్
Anantapur Urban, Anantapur | Mar 25, 2026
సంక్షేమ శాఖలు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సంక్షేమ శాఖలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 13,683 మందికి పైగా ఉన్న దివ్యాంగులకు 100 శాతం యుడిఐడి కార్డులను మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని, యుడిఐడి కార్డుల వల్ల కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.