మంత్రాలయం: కాచాపురం గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల పిపిపి విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసిపి కోటి సంతకాలు కార్యక్రమం
మంత్రాలయం:ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, ఈ కుట్రలను ప్రజలంతా కలిసి నిలుద్దామని మంత్రాలయం వైసీపీ సీనియర్ నాయకుడు కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి ఆదేశాల మేరకు ఆయన మంత్రాలయం మండలం కాచాపురం గ్రామంలో కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించారు. పీపీపీ విధానం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆరోపించారు.