భూపాలపల్లి: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పై బి ఆర్ ఎస్ పార్టీ అసత్య ఆరోపణలు మానుకోవాలి : కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు దేవన్
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఆదివారం ఉదయం 10 గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేసినట్లు పట్టణ అధ్యక్షుడు దేవన్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్నటి రోజున ఎమ్మెల్యే గండ్ర,ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను బిఆర్ఎస్ పార్టీ నాయకులు దహనం చేసి ఎమ్మెల్యే గండ్రపై అసత్యపు ఆరోపణలు చేశారని మాజీ ఎమ్మెల్యే గండ్ర ఎన్నో అరాచకాలకు పాల్పడి ఇసుక మాఫియా,మట్టి మాఫియా,బొగ్గు మాఫియా పాల్పడ్డారని ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే గండ్రపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు.