ఘన్పూర్ స్టేషన్: స్టేషన్ ఘన్ పూర్ : రాఘవపూర్ గ్రామ జాతీయ రహదారిపై బైక్ ను ఢీకొన్న కారు దంపతులకు తీవ్ర గాయాలు
స్టేషన్ ఘన్ పూర్ మండలం రాఘవపూర్ గ్రామ జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం 5 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇప్పగూడెం గ్రామానికి చెందిన నాగబండి సాయికిరణ్ - రచన దంపతులకుతీవ్ర గాయాలయ్యాయి. ఇప్పగూడెం గ్రామానికి చెందిన సాయికిరణ్ -రచన దంపతులు రఘునాథపల్లి మండల కేంద్రంలో జరిగిన వివాహానికి హాజరయ్యారు. హన్మకొండలో మరో వివాహం ఉండగా మోటార్ సైకిల్ పై వెళుతుండగా రాఘవపూర్ గ్రామ సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల వద్ద జనగామ నుండి హనుమకొండ వైపు వెళుతున్న కారు వెనుక నుండి వారిని ఢీకొట్టింది .ఈ ఘటనలో రచనకు కాలు మడమ విరిగిపోగా సాయికిరణ్ చేతులకు బలమైన గాయాలయ్యాయి.