జిల్లాలో ఈనెల 6 వ తేదీ నుండీ మూడ్రోజుల పాటు జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. ప్రతిఏడాది నిర్వహించే ఈ స్పోర్ట్స్ మీట్ ను జిల్లాలో ఘనంగా ముగించాలనే సంకల్పంతో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా నేతృత్వంలో బుధవారం రాత్రి 7:30 గంటల సమయంలో జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్పోర్ట్స్ మీట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.