రేవల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సూపర్‌వైజర్లు తిన్న తర్వాతే విద్యార్థులకు వడ్డించాలి: కలెక్టర్
రేవల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలతో పాటు, తల్పునూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకస్మికంగా సందర్శించారు. కేజీబీవీలో వంట సామాగ్రిని భద్రపరిచిన గదిని తనిఖీ చేసిన కలెక్టర్ రిజిస్టర్లను పరిశీలించారు. స్టాక్ వచ్చినప్పుడు రిజిస్టర్ లో ఎంట్రీ చేయాలని చెప్పారు. విద్యార్థుల సమక్షంలోనే స్టాక్ ను దించుకోవాలని సూచించారు. వంట సామాగ్రి కి సంబంధించిన వస్తువులు ఎక్స్పెరి డేట్ తప్పనిసరిగా చెక్ చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.