దుబ్బాక: గంభీర్పూర్లో కరికె రాజయ్య కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గంభీర్పూర్లో కరికె రాజయ్య మృతి చెందిన విషయం తెలుసుకొని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య వారి కుటుంబాన్ని పరామర్శించారు. మృత దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. రాజయ్య మృతి చెందడం బాధాకరం అని, వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాని మనోధైర్యం ఇవ్వాలని భగవంతున్ని కోరుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట పలువురు గ్రామస్తులు ఉన్నారు.