పెద్దపల్లి: కార్పొరేట్ కళాశాల స్కీం కింద 30 లోపు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయాలి: జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి వినోద్
2025-26 సంవత్సరానికి రెప్యూటెడ్ (కార్పొరేట్) జూనియర్ కళాశాల స్కీం క్రింద నమోదు చేసుకొనుటకు జూనియర్ కళాశాలలు ఆన్ లైన్ లో ఏప్రిల్ 30 లోపు రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్ శనివారం మధ్యాహ్నం 12 గంటలకుఒక ప్రకటనలో తెలిపారు. నూతనముగా ఎంపిక చేయుటకు రెసిడెన్సియల్ వసతి కలిగిన, విద్యా బోధన లో ఉన్నత ప్రమాణాలు కలిగి, కాంపిటెటివ్ పరిక్షలలో ఎక్కువ సంఖ్య ఉత్తిర్ణతా శాతము కల్గినటువంటి జూనియర్ కళాశాలల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగిందన్నారు.