రాజంపేట: రైతును రాజు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు
సోమవారం రాజంపేట మండలం,మందరం గ్రామపంచాయతీ నందు నిర్వహించిన "రైతన్న... మీకోసం" కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆధునిక వ్యవసాయం,మెలుకువలు నేర్చుకోవాలని,వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలని,ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు మరియు పార్టీ ముఖ్య నాయకులు తదితరులు ప్రత్యేకంగా పాల్గొన్నారు.