కొత్తకోట: మద్యం తాగి వాహనాలు నడపడం వల్లనే అధిక రోడ్డు ప్రమాదాలు: ఎస్పీ రావుల గిరిధర్
కొత్తకోట పోలీస్ స్టేషన్ లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కొత్తకోట సిఐ రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించి ఆటో, తుఫాన్,లారీ, ప్రైవేట్ స్కూల్ బస్సుల డ్రైవర్లకు విద్యార్థులకు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో పాల్గొని అవగాహన కల్పించారు.ఎవరైనా యాక్సిడెంట్స్, హార్ట్ హటాక్, ఫిట్స , కరెంట్ షాక్ కు గురై నప్పుడు ఆ అత్యవసర సమయంలో అందించే యాక్సిడెంట్ ఫస్ట్ రెస్పండర్ శిక్షణ సిపిఆర్ ఏ విధంగా చేయాలో డాక్టర్లచే అవగాహన కల్పించారు. అదేవిధంగా డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు చేయించారు.