ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గార్లదిన్నె గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. మార్కాపురం నూతన జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఉద్యోగాల కోసం దేశాలు పట్టుకొని వెళ్లాల్సిన పనిలేదని ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. 10 సంవత్సరాలు నాకు అవకాశం కల్పించండి అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే అన్నారు