ధర్మారం: మండలంలోని పలు దుకాణాల యజమానులకు భూగర్భ జలశాఖ నోటీసులు, సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్
ధర్మారం మండల కేంద్రంలో ఉన్న వాటర్ ప్లాంట్, సర్వీసింగ్ సెంటర్, సిమెంట్ బ్రిక్స్ దుకాణాల 27 మంది యజమానులకు భూగర్భ జలశాఖ అధికారులు ఇటీవల నోటీసులు ఇచ్చారు. బోర్ వాటర్ కు సంబంధించి సరైన అనుమతులు లేకపోవడంతో నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన వ్యాపారస్తులు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ దృష్టికి ఆదివారం తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఒరెం చిరంజీవి తదితరులున్నారు