నగరంలో తెల్లవారు జామున పవర్ ఆఫీస్ వద్ద ఉన్న 6వ సర్కిల్ మస్టర్ పాయింట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే దగ్గుబాటి
Anantapur Urban, Anantapur | Mar 26, 2026
అనంతపురం నగరంలో గురువారం తెల్లవారుజామున 5:30 కి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మిక తనిఖీలు చేశారు.బైక్ పై మున్సిపల్ కమిషనర్ తో కలిసి నగరంలో పర్యటన చేశారు.పవర్ ఆఫీస్ వద్ద ఉన్న 6వ సర్కిల్ మస్టర్ పాయింట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.పారిశుద్ధ్య కార్మికులు ఎంతమంది ఉన్నారని ఆరా తీశారు.బదిలీ వర్కర్లపై గత కొన్ని రోజులుగా ఫిర్యాదులు వచ్చాయన్నారు.రెగ్యులర్ ఉద్యోగుల స్థానంలో కొంతమంది బదిలీ వర్కర్ల విధులు నిర్వర్తిస్తున్నారు.అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బదిలీ వర్కర్లకు అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ఆదేశాలు జారీ చేశారు.