ఒంగోలు: నగరంలో బిజెపి పాలనకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహణ,
కేంద్రంలో రైతాంగ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బిజెపి పాలనకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం బైక్, ర్యాలీని ఒంగోలు నగరంలో నిర్వహించారు, ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు హాజరయ్యారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలోని బిజెపిని ఓడించడం ద్వారా మాత్రమే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోగమలని అన్నారు