ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల సమగ్ర తీరంలో ఫిబ్రవరి 14 15వ తేదీలలో జరిగే బీచ్ ఫెస్టివలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీచ్ ఫెస్టివల్ కు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయటం జరిగిందన్నారు. పాకల సమగ్ర తీరం చాలా విశాలమైనదని ప్రశాంతమైనదని అటువంటి ప్రాంతంలో ఫెస్టివల్‌ను ఏర్పాటు చేయటంతో టూరిజం పరంగా అభివృద్ధి చెందుతుంది అన్నారు. సందర్శకులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు