గొల్లపల్లి: చందోలి గ్రామంలో ఘనంగా పీర్ల పండుగ, మతాలకు అతీతంగా వేడుకల్లో పాల్గొన్న గ్రామస్తులు
గొల్లపల్లి మండలం చందోలి గ్రామంలో శనివారం సాయంత్రం పీర్ల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన పీర్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పీర్లను డప్పు చప్పుల నడుమ గ్రామంలో ఘనంగా ఊరేగించారు. మతాలకు అతీతంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పీర్ల పండుగలో పాల్గొన్నారు. పీర్లకు కుడకల దండాలతో పాటు దస్తీలను కట్టి మొక్కులు చెల్లించుకున్నారు.