అనంతపురం జిల్లా గార్లదిన్నె లో గురువారం రాత్రి 7 గంటల సమయంలో ద్విచక్ర వాహనం ఢీకొన్న గుర్తుతెలియని వాహనం. ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న నాగులగుండం తండాకు చెందిన తిరుపాల్ నాయక్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో మెరుగన్న చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. గార్లదిన్నె నుండి నాగులగుండం తండాకు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా గార్లదిన్నె ఊరి బయట ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.