దుబ్బాక: రాయపోల్ - తిమ్మకపల్లి గ్రామాల మధ్య ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొని ఇద్దరికి తీవ్ర గాయాలు
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి రాయపోల్ - తిమ్మకపల్లి గ్రామాల మధ్య ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే 108 వాహనం ద్వారా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వీరిద్దరూ దొమ్మాట, గొల్లపల్లి గ్రామాలకు చెందిన వారుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.