కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు నాయకులు కర్నూలు మార్కెట్ యార్డు యూనియన్ గౌరవ అధ్యక్షుడు టి. రాముడు డిమాండ్ చేశారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలు సమ్మె నోటీసును మార్కెట్ యార్డు సెలక్షన్ గ్రేడ్ సెక్రెటరీ జయలక్ష్మి అందజేశారు. జులై 9వ తేదీన సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రజలపై వేస్తున్న పన్నులు,ధరల బారాలు తగ్గించాలని జులై 9వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న అన్ని కార్మిక సంఘ