నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని అహోబిలం బ్రహ్మోత్సవాలను అన్ని శాఖల అధికారుల సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసే విజయవంతం చేయాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల చేశారు ఈనెల 20 నుంచి అహోబిలంలో జరగనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి మంగళవారం అన్ని శాఖల అధికారులతో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమీక్ష సమావేశం నిర్వహించారు, అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు, ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోద్ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు