సిద్దిపేట అర్బన్: దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హైమావతి
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏఎన్ఎం మరియు స్వీపర్ లు తప్ప ఎవ్వరు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేసి కంప్లైంట్ రాసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఫోన్ ద్వారా విధులు సక్రమంగా నిర్వహించకుండా సమయానికి ఆసుపత్రి కి రాని అందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. పిఎచ్ సి మొత్తం కలియ తిరిగి అన్ని వార్డులు, మరుగుదొడ్లు ఎల్లపుడు శుభ్రంగా ఉంచుకోవాలని విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వైద్యం చేయడమే ము