పెద్దపల్లి: ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర 5 వ మహాసభలను జయప్రదం చేయండి : SFI పెద్దపల్లి జిల్లా కార్యదర్శి జిల్లాల ప్రశాంత్
ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర 5 వ మహాసభలను జయప్రదం చేయాలని మహాసభల వాల్ పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జిల్లాల ప్రశాంత్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఈనెల ఏప్రిల్ 25,26,27 తేదీల్లో ఖమ్మం జిల్లాలో జరుగుతున్నాయి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్య సంస్థలలో చదువుకునే విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు అరకుర ఇబ్బందులతో చదువులను అనుసరిస్తున్నారు. రాష్ట్రానికి ఇప్పటివరకు కూడా ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అని వారు అన్నారు.