భూపాలపల్లి: అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు
భూపాలపల్లి నియోజకవర్గం లోని టేకుమట్ల మండలంలోని కలికోట చలివాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్న నేపథ్యంలో వెంటనే అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు ధర్నా చేపట్టినట్లు తెలిపారు బి ఆర్ ఎస్ పార్టీ మండల నాయకులు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ ఇసుక రవనా వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతుల పంటలు పండడం లేదని, వెంటనే అక్రమ ఇసుక రవాణాలను అడ్డుకోవాలని నేను యెడల ఆందోళన కొనసాగిస్తామన్నారు ఈ నేపథ్యంలో పోలీసులు చేరుకొని టిఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.