62రోజులు పాటు వేచిచూసి,63వ రోజైన మంగళవారం నర్సీపట్నంలో జీ.కోడూరు రాతిక్వారీ బాధితుల నిరాహారదీక్షను భగ్నం చేసిన పోలీసులు
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 62 రోజులు పాటు వేచి చూసిన పోలీసులు 63వ రోజైన మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేస్తున్న జీ కోడూరు రాతి క్వారీ బాధితుల ఆందోళన శిబిరాన్ని భగ్నం చేశారు. ఆందోళన చేస్తున్న వారందరినీ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించి పూచికత్తులు అనంతరం వారిని విడిచిపెట్టారు.