రోడ్డు ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి : మిడుతూరు ఎస్సై ఓబులేసు
రోడ్డు ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని మిడుతూరు ఎస్సై ఓబులేష్ అన్నారు,నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చెరుకుచెర్ల బాట దగ్గర నందికొట్కూరు- నంద్యాల ప్రధాన రహదారిలో మంగళవారం రోడ్డు ప్రమాదంలో జరగకుండా రోడ్డుపై వైట్ కలర్ ను ఎస్సై వేయించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేక్ దగ్గర వైట్ కలర్ వేయించినట్లు ఎస్సై తెలిపారు.ప్రతి వాహనదారుడు అతివేగంగా వెళ్లకుండా జాగ్రత్తగా వెళ్తూ మీ గమ్యానికి చేరుకోవాలని ఎస్సై సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ హరిప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.