ఒంగోలు: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పర్యటన విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు,జిల్లా అధ్యక్షులు సుధాకర్,
నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి పర్యటన విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి తెలిపారు, ఈ సందర్భంగా ఒంగోలు నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు,