యాదవులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని యాదవ సంఘం మండల అధ్యక్షులు వాసరి రవి యాదవ్, ప్రధాన కార్యదర్శి లాల్చావుల రాజేష్ యాదవ్ అన్నారు. రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన భూషణ వేణి శ్రీనివాస్ యాదవ్, లలిత ల కుమార్తె భూషణ వేణి వైష్ణవి స్థానిక మోడల్ స్కూల్ లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యనభ్యసించి ఎంపీసీ లో1000 మార్కులకు గాను 983 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచింది.దీనికి గాను మధ్య తరగతి కుటుంబం లో పుట్టి ఇటిక్యాల ప్రభుత్వ ఆదర్శ (మోడల్) పాఠశాలలో విద్యనభ్యసించి గ్రామ,మండల,జిల్లా ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో ఇనుమడింప చేసిన వైష్ణవిని అభినందించారు