గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి: సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకర్రావు
మున్సిపల్ కార్మికుల వలె గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించి బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకర్రావు డిమాండ్ చేశారు, గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలంటూ బుధవారం అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు నిరసన నిర్వహించారు.