సంతనూతలపాడు: పేర్నమిట్ట రహదారిలో రోడ్డు ప్రమాదం, ఐదుగురు మహిళా కూలీలకు తీవ్ర గాయాలు గాయాలు, ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలింపు
సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట రహదారిలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఆటో బోల్తా పడడంతో ఐదుగురు మహిళా కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ అజయ్ బాబు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. హుటాహుటిన సహాయక చర్యలను చేపట్టారు. అనంతరం గాయపడ్డ వారిని అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు.