బాల్కొండ: ఏర్గట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సొసైటీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
ఎర్గట్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మరియు ప్రాథమిక సహకార సంఘాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, జ్వరాలు, టీకాలు, మందుల లభ్యత పై డాక్టర్ రక్షిత ను మరియు సోసైటీలో ఎరువుల స్టాక్ గురించి వ్యవసాయ అధికారి వైష్ణవ్ ను అడిగి తెలుసుకున్నారు, ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శివకృష్ణ , MPDO , తహసీల్దార్ , MPO తదితరులు పాల్గొన్నారు.