మంత్రాలయం : శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం ఆధ్వర్యంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించనున్న లక్ష దీపోత్సవ ఏర్పాట్లను స్థానిక ఎస్సై శివాంజల్లో కలిసి ఎస్పి పరిశీలించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ తుంగభద్ర నది తీరంలో పుణ్య హారతితో పాటు లక్ష దీపోత్సవ కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని శ్రీ మఠం అధికారులకు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్సై శివాంజలకు సూచించారు.