యాడికి మండల కేంద్రంలో సోమవారం మన యాడికి పరిశుభ్రత-మనందరి బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అన్ని కాలనీలో పర్యటించారు. జే సీ బీ ల సాయంతో డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయించారు. డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు.అందరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు.