రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ప్రతి ఒక్కరూ పనిచేయాలని అంగన్వాడీ సిబ్బందితో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని సిడిపిఓ కార్యాలయ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం అంగన్వాడీ సిబ్బందికి 5 జీ స్మార్ట్ మొబైల్ ఫోన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు,ఈ సమావేశానికి ఆరు మండలాల అంగన్వాడీ సిబ్బంది హాజరయ్యారు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పిల్లల వయసుకు తగ్గ వారు లేరని ఎక్కడ చూసినా బరువు తక్కువ పిల్లలు ఉన్నారని అలా ఎందుకు ఉంటున్నారని సిబ్బందిని ఎమ్మెల్యే ప్రశ్నించారు.0-5 సం.ల పిల్లల్లో రక్తహీనత మెరుగుపడిందని ప్రభుత్వాన