రుద్రూర్: రుద్రూరు పెద్ద చెరువులో ఓ యువకుడి మృతదేహం ... ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై అప్పారావు
రుద్రూర్ పెద్ద చెరువులో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. రుద్రూర్ గ్రామానికి చెందిన నరేశ్ చెరువులో చేపల వేటకు వెళ్లగా వల చుట్టుకుని మృతి చెందినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై అప్పారావు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహన్ని వెలికి తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బోధన్ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది