ప్రతి విద్యార్థి చట్టాలు పై అవగాహన కలిగి ఉండాలి: సీఐ బి.రాఘవ రెడ్డి
ప్రతి విద్యార్థి చట్టాల పై అవగాహన కలిగి ఉండాలని సీఐ బి.రాఘవ రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం వాల్మీకిపురం మండలం వాల్మీకిపురం పట్టణంలోని పి.వి.సి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నేరాల నియంత్రణ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వాల్మీకిపురం సీఐ బి.రాఘవ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి వలన కలిగే అనర్ధాల గురించి వివరించారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపరాదని హెచ్చరించారు.