పత్తికొండ: పత్తికొండ మండలంలో సర్వసభ్య సమావేశం వ్యవసాయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం ఎంపిటిసిలు
పత్తికొండ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ నారాయణదాసు ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. వ్యవసాయ శాఖ అధికారి రైతులకు అందుబాటులో ఉండడం లేదని ఎంపీటీసీలు ఈరన్న, కేశవరెడ్డి తీవ్రంగా విమర్శించారు. రసాయనక మందులు, ఎరువులు, విత్తనాలు ఏవి అందుబాటులో ఉన్నాయో లేవో ప్రజలకు వివరంగా తెలపడంలో వ్యవసాయ శాఖ అధికారి విఫలమయ్యాడన్నారు. ఎంపీడీవో, సింగిల్ విండో ఛైర్మన్ పాల్గొన్నారు.