సిరికొండ: చిమ్మన్ గుడి సమీపంలో టిప్పర్ ను ఢీకొట్టిన బైక్,ఒకరికి తీవ్ర గాయాలు
సిరికొండ మండలంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని చిమ్మన్ గుడి గ్రామానికి చెందిన జాదవ్ అజయ్ తన ద్విచక్ర వాహనంపై మండల కేంద్రానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో చిమ్మన్ గుడి గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ ను ఢీకొట్టాడు. ప్రమాదంలో అజయ్ కి తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌లో అదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.