భూపాలపల్లి: మహిళలు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కుటుంబ ఆరోగ్యానికి పునాది : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్వస్త్ నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బెల్లయ్య నాయక్ తో కలిసి పాల్గొన్నట్లు ఎమ్మెల్యే గండ్ర బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలిపారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి మెరుగైన ఆరోగ్యం సంరక్షణ సేవలు అందించడం ద్వారా మహిళలకు చిన్నారులకు సాధికారిక కల్పించడమే ఈ అభియాన్ ప్రధాన లక్ష్యమన్నారు.అనంతరం జూకల్ గ్రామంలో పోషణ మాసోత్సవ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో కలిసిపాల్గొన్నట్లు ఎమ్మెల్యే గండ్ర తెలిపారు.