ఆసీఫ్ నగర్: ఆసీఫ్ నగర్లో చైనా మాంజాను స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేశాం: ఏసీపీ విజయ్ శ్రీనివాస్
నగరం లో మరోసారి చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నాలుగు లక్షల రూపాయలకు పైగా విలువ చేసే నిషేదిత మాంఝా ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు అధికారులు. ఇలాంటి మాంజా ల వల్ల మనుషులతో పాటు పక్షులకు కూడా ప్రాణహాని ఉంటుందని వాటిని వినియోగించకుండ చూసుకోవాలన్నారు పోలీసులు