కొడంగల్: కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్‌ను రద్దు చేయాలి: ఎంఐఎం పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్.బి గుల్షన్
కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును రద్దు చేయాలని వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఎస్ బి గుల్షన్ మంగళవారం పత్రిక విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలను ఆర్థికంగా అనగదొక్కెందుకే ఈ బిల్లును ఆమోదించడం జరిగిందని ఆరోపించారు. అందుకు నిరసనగా ఏప్రిల్ 18 శుక్రవారం మధ్యాహ్నం కోడంగల్ నియోజకవర్గ కేంద్రంలో ఆమోదించిన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకు నిరసనగా భారీ నిరసన ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, నియోజకవర్గానికి చెందిన ముస్లిం మైనార్టీలు అధిక సంఖ్యలో హాజరై నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.