చీపురుపల్లి: చీపురుపల్లి లో అట్టహాసంగా టిడిపి అభ్యర్థి కిమిడి కళావెంకట్రావు నామినేషన్
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి చీపురుపల్లి నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళావెంకట్రావు చీపురుపల్లి ఆర్డీవో కార్యాలయం లో బుధవారం ఉదయం 11.09 నిమిషాలకు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. చీపురుపల్లి రిటర్నింగ్ అధికారి బి శాంతి కి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ముందుగా అచ్చుతాపురం శ్రీ సాయి బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఆర్డీఓ కి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.