నంద్యాల జిల్లా బేతంచర్ల జంగాలపేట కాలనీ సమీపంలోని చెత్త డంపింగ్ యార్డులో బుధవారం సాయంత్రం భారీగా మంటలు చెలరేగాయి. గతంలో వేరు చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలకు మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు.ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఎవరైనా నిప్పు పెట్టారా అన్నది తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు.