ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆర్ సి పి ఐ ఆధ్వర్యంలో ధర్నా
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం ఎదట ఆర్ సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ప్రజలు గత మూడు సంవత్సరాల క్రితం ఇల్లు నిర్మించుకొని నివసిస్తుంటే వారికి కనీస సౌకర్యాలు సైతం అధికారులు కల్పించలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.